Site icon OkTelugu

Motorola G67 features and price: ఈ Motorola ఫోన్ గురించి తెలిశాక.. కెమెరా, బ్యాటరీ సూపర్ అని అంటారు.. ధర కూడా తక్కువగానే..

Motorola G67 features and price

Motorola G67 features and price

Motorola G67 features and price: ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తగా మొబైల్ కొనేవారు కెమెరా పనితీరుతో పాటు బ్యాటరీ మెరుగ్గా ఉండాలని చూస్తున్నారు. కొన్ని కంపెనీలు సైతం ప్రత్యేకంగా ఇవి నాణ్యంగా ఉండాలని శ్రద్ధ చూపిస్తున్నాయి. అయితే ప్రముఖ కంపెనీ Motorola మార్కెట్లోకి తీసుకువచ్చిన లేటెస్ట్ మొబైల్ లో 7000 mAh బ్యాటరీని చేర్చారు. అలాగే 50 MP మెయిన్ కెమెరాను ఉంచారు. ఈ రెండు రోజువారి వినియోగదారులతో పాటు యూత్ కు అనుగుణంగా ఉండడంతో ఈ మొబైల్ పై ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా దీనిపై భారీ డిస్కౌంట్ ప్రకటించడంతో మిడిల్ క్లాస్ పీపుల్స్ దీనిపై ఆసక్తి చూపుతున్నారు. ఇంతకీ ఇది ఏ మొబైల్ అంటే?

Motorola కంపెనీ నుంచి ఇప్పటివరకు మోటో G 86 పవర్ వంటి మొబైల్స్ ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి అలరించాయి. అయితే ఇందులో మోటో G 67 అనే మొబైల్ ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ లేటెస్ట్ వినియోగదారులకు అనుగుణంగా ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో 6.7 HD+ అందులాల LCD డిస్ప్లే కలిగి ఉంది. ఈ డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ 7i సపోర్ట్ గా ఉంది. అంతేకాకుండా దీనిపై వేగాన్ లెదర్ ఫినిష్ కలిగి ఉండడంతో ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఇది కింద పడిన ఎలాంటి ఆటంకం లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ఈ మొబైల్ MIL 810H సర్టిఫికెట్ ను కలిగి ఉండడంతో దీనిపై చాలామంది ఆసక్తి చూపుతున్నారు.

Also Read: ఈ Samsung ఫోన్ పై ఏకంగా రూ.13,500 తగ్గింపు.. వెంటనే కొనుగోలు చేయండి..

ఈ మొబైల్ లో స్నాప్ డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్ ను అమర్చారు. అలాగే ఇందులో ఆండ్రియో GPU కూడా ఉండడంతో ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UX OS తో పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ మూడు సంవత్సరాలు వరకు సెక్యూరిటీ అప్డేట్ ను అందిస్తుంది. మోటో G 67 మొబైల్ లో కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో 50 MP మెయిన్ కెమెరాను అమర్చారు.8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది.32 MP సెల్ఫీతో పాటు వీడియో కాలింగ్ కోసం ఉండనుంది. ఈ కెమెరా లతో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారికి స్కూల్ సపోర్ట్ గా ఉంటుంది. ఇందులో బ్యాటరీ విషయం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ లో 7000 mAh బ్యాటరీ ఉండగా.. ఇది 30 W ఫాస్టెస్ట్ చార్జింగ్ తో సపోర్ట్ చేస్తుంది.

ఇన్ని అద్భుతమైన ఫీచర్లో ఉన్న మోటో G 67 మొబైల్ ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ మొబైల్ మార్కెట్లో 8 GB Ram, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999 గా ఉంది. 8gb రామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగిన మొబైల్ ను 18,999 తో కొనుగోలు చేయవచ్చు. అయితే మోటరోలా ఇండియా వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసేవారు డిస్కౌంట్తో దీనిని కొనుగోలు చేయవచ్చు.

Exit mobile version