హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఆరేళ్ల పాపపై అఘాయిత్యం జరిగితే ప్రభుత్వం ఏం చేస్తుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్.. వారికి ఆర్థిక సాయం చేశారు. దిశ కేసులో నిందితులను ఎలాగైతే ఎన్ కౌంటర్ చేశారో.. అలాగే ఈ కేసులో నిందితుడిని కాల్చి చంపాలని డిమాండ్ చేశారు.