
కోవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న వారిలో రోగ నిరోధన శక్తి ఎక్కువగా పెరిగినట్లు గుర్తించామని ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ ప్రకటించారు. తొలి డోసు ప్రభావ శీలత ఎక్కువగా ఉన్నందునే రెండు డోసుల మధ్య వ్యవధిని ఆరు వారాల నుంచి మూడు నెలలకు పెంచినట్లు వివరించారు. అదే సమయంలో కోవాగ్జిన్ తొలి డోసు ప్రభావం ఎక్కువగా లేదని, అందుకే రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచలేదన్నారు. కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ పెంచడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుందన్నారు.