Homeజాతీయం - అంతర్జాతీయం300 మీటర్ల ఎత్తున్న బిల్డింగ్ ఊగిపోయింది

300 మీటర్ల ఎత్తున్న బిల్డింగ్ ఊగిపోయింది

చైనా లోని షెంజెన్ నగరంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం ఊగిపోయింది. సుమారు 300 మీటర్ల ఎత్తు ఉన్న ఆ బిల్డింగ్ గత మంగళవారం ఆకస్మాత్తుగా షేక్ అయ్యింది. స్పెషల్ ఎకనామిక్ జోన్ లో ఉన్న ఆ బిల్డింగ్ చాలా సేపు ఊగిపోవడంతో దాంట్లో ఉన్న వ్యాపారులు, కిరాయిదారులు బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల ఆ బిల్డింగ్ ఊగలేదని ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అధికారులు తేల్చారు. అధికారిక తనిఖీలు ముగిసిన తర్వాతనే ఆ బిల్డింగ్ ను తెరవనున్నట్లు బిల్డింగ్ ఓనర్లు తెలిపారు. 2000 సంత్సరంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ బిల్డింగ్ ను ప్రస్తుతం డ్రోన్లతో పరిశీలిస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular