
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మరోసారి ఐపీఎల్ ను టార్గెట్ చేశాడు. టెస్టు మ్యాచ్ రద్దైన నేపథ్యంలో ఐపీల్ జట్లు ఆటగాళ్లను తరలిస్తున్నాయి. యూఏఈ లో 6 రోజుల క్వారంటైన, టోర్నీ ప్రారంభం కావడానికి 7 రోజుల టైం ఉంది. దీన్ని బట్టి ఐపీఎల్ కోసమే టెస్ట్ మ్యాచ్ రద్దు చేసుకున్నారని స్ఫష్టంగా అర్థం అవుతోంది. అని వాన్ ట్వీట్ చేశారు. కొవిడ్ భయాలు మధ్య ఎలా ఆడతారని, భారత్ ఫ్యాన్స్ వాన్ పై మండిపడుతున్నారు.