ఆ ప్రచారంలో నిజంలేదు.. కేంద్రం

సుప్రీంకోర్టు ధర్మాసనాలను దేశంలోని మరో మూడు నగరాల్లో నెలకొల్పుతారంటూ వచ్చిన ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం  తోసిపుచ్చింది. అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీకి వెలుపల సుప్రీంకోర్టు ధర్మాసనాలను ఏర్పాటు చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం సానుకూలంగా లేదని పలు సందర్భాల్లో పార్లమెంట్ కు తెలిపిన విషయాన్ని గుర్తు చేసింది. చెన్నై, కోల్ కతా, ముంబయిలలో సుప్రీంకోర్టు ధర్మాసనాల ఏర్పాటుకు నిర్ణయం జరిగిందంటూ సామాజిక మాధ్యమం వాట్సప్ లో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. నిజానిజాల […]

Written By: Suresh, Updated On : August 12, 2021 9:19 am
Follow us on

సుప్రీంకోర్టు ధర్మాసనాలను దేశంలోని మరో మూడు నగరాల్లో నెలకొల్పుతారంటూ వచ్చిన ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం  తోసిపుచ్చింది. అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీకి వెలుపల సుప్రీంకోర్టు ధర్మాసనాలను ఏర్పాటు చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం సానుకూలంగా లేదని పలు సందర్భాల్లో పార్లమెంట్ కు తెలిపిన విషయాన్ని గుర్తు చేసింది. చెన్నై, కోల్ కతా, ముంబయిలలో సుప్రీంకోర్టు ధర్మాసనాల ఏర్పాటుకు నిర్ణయం జరిగిందంటూ సామాజిక మాధ్యమం వాట్సప్ లో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. నిజానిజాల నిర్ధరణ చేసుకోగా అది బూటకపు ప్రచారంగా తేలిందని పీఐబీ ట్వీట్ చేసింది.