
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే దళిత, గిరిజన దండోరా సభలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ చార్జీలను నియమించారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్ లను నియమించి బాధ్యతలను అప్పగించారు. ఈ నెల 9న జరిగిన ఇంద్రవెల్లి సభకు ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 17 వరకు రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా దళిత, గిరిజన దండోరా పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. అధిష్టానం ఆదేశాలతో రేవంత్ రెడ్డి ఈ సభలను ఖరారు చేశారు. ఇంద్రవెల్లి నుంచి మొదలుపెట్టిన దళిత, గిరిజన దండోరాను రాష్ట్రమంతా నిర్వహించనుండగా దీని కోసం ప్రతి సగ్మెంట్ కు కో ఆర్టినేటర్ ను ఏర్పాటు చేశారు.