Movie Piracy : టెలిగ్రామ్ అనే యాప్ ద్వారా సినిమాలో ఓటిటి కంటెంట్ మొత్తం పైరసీ అవుతుందంటూ గతంలో పెను సంచలనాలను క్రియేట్ చేసే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. దాంతో అందరు దానిమీద విరుచుకుపడ్డారు. టెలిగ్రామ్ యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోవడమే ఆలస్యం అందులో కొంతమంది కొన్ని సినిమాల లింకులను పంపించడం దానిని ఓపెన్ చేసి అందరు విచ్చలవిడిగా చూస్తూ ఉండడం జరిగిపోయాయి. ఇక దాంతో NEET రీ ఎగ్జామ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్ ను బ్యాన్ చేసింది. ప్రస్తుతం ఆ కంపెనీకి పెద్ద ప్రభుత్వం నోటీసులైతే జారీ చేసింది. అక్రమంగా ఆ యాప్ ద్వారా ఓటిటి కంటెంట్ పైరసీ అవుతుందని దానికి సంబంధించిన వివరణ 15 రోజుల్లో ఇవ్వాలని కోరింది. ఓటిటి సంస్థలను అలాగే సినిమాలను కాపాడుకోవడమే తన లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
ఇక మొత్తానికైతే ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీలో సినిమాల బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. దానివల్ల సినిమా కంటెంట్ పైరసీ చేస్తే ప్రొడ్యూసర్ల పొట్ట కొట్టిన వాళ్ళు అవుతారు అలాగే వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి పైరసీలను ఎంకరేజ్ చేసే యాప్ లను క్లోజ్ చేస్తేనే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చాలా అద్భుతం అని చాలామంది సినిమా మేధావులు సైతం కేంద్ర ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు.
మరి ఈ రకంగానే టెలిగ్రామ్ యాప్ లో ఓటిటి యాప్ కి సంబంధించిన సినిమాలను పైరసీ చేయనియకుండా ఆపగలుగుతారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… కేంద్ర ప్రభుత్వం పైరసీలను సక్సెస్ ఫుల్ గా నిలపగలిగితే మాత్రం సినిమాలకు భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.
అలాగే ప్రతి ప్రొడ్యూసర్ కూడా విపరీతంగా లాభాలను ఆర్జించవచ్చు. మంచి కంటెంట్ ను ఎంకరేజ్ చేయడానికి ఇంకొంతమంది ప్రొడ్యూసర్లు కూడా ముందుకు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…ఇక దీని మీద కొంతమంది ఇండస్రీ పెద్దలు సైతం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు…

