TGPECET Results: తెలంగాణలో వ్యాయామ విద్య బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇటీవల పాలమూరు విశ్వవిద్యాలయం నిర్వహించిన పీఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ బాలకిష్టారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల్లో 94.96 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు టీజీ పీఈసెట్ కన్వీనర్ ఆచార్య దిలీప్ తెలిపారు. pecet tgche ac in లో ర్యాంకు కార్డు డౌలోడ్ చేసుకోవచ్చు.