
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ కు తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. ఏపీ అక్రమంగా జలాలు తరలించకుండా చూడాలని ఈఎస్పీ మురళీధర్ రాసిన లేఖలో విజ్ఞప్తి చేసింది. అనుమతులు లేని ప్రాజెక్టుల ద్వారా తరలింపును అడ్డుకోవాలని కోరింది. మచ్చుమర్రి ఎత్తిపోతల, మాల్యాల పంపింగ్ స్టేషన్, బనకచర్ల రెగ్గులేటర్ నుంచి నీటి తరలింపు ఆపాలని పేర్కొంది. ఈ మూడింటి నుంచి కేసీ కెనాల్ కు నీటిని తరలిస్తున్నారని, కేసీనెనాల్ కు తుంగభద్ర నుంచి నీరు సరఫరా అవుతుందని లేఖలో వివరించింది.