
వక్ఫ్ భూములపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వక్ఫ్ భూముల చుట్టుూ సరిహద్దు గోడ నిర్మించాలన్నారు. మైనారిటీ సంక్షేమశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఉపాధి పనుల ద్వారా సరిహద్దు గోడలు నిర్మించడాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. కర్నూలులో వక్ఫ్ ట్రైబ్యునల్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. మైనార్టీ శాఖలో పెండింగ్ సమస్యలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.