
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను తీవ్రంగా కుదిపేస్తోన్న పెగాసస్ తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై ఎట్టకేలకు కేంద్రం పెదవివిప్పింది. ఆ స్పైవేర్ తయారీ సంస్థ ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ వో గ్రూప్ తో తాము ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని కేంద్ర రక్షణ శాఖ సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన పెగాసస్ స్పైవేర్ తో భారత్ సహా పలు దేశాలు ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఇటీవల సంచలన కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.