
జంట నగరాల్లో లాక్ డౌన్ ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. 99 శాతం మంది ప్రజలు లాక్ డౌన్ పాటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నిత్యం 8 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయని, 7 వేలకు పైగా వాహనాలను సీజ్ చేస్తున్నామని వెల్లడించారు. శుక్రవారం ఆయన మెహదీపట్నం లోని రైతుబజార్, పోలీస్ చెక్ పోస్టులను పరిశీలించారు.