
కింగ్ నాగార్జున – ప్రవీణ్ సత్తారు కలయికలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతుంది. అయితే, ఈ యాక్షన్ డ్రామా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా ఓ సెట్ నిర్మాణం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దగ్గర ఉండి మరీ, ఈ సెట్ తాలూకు యాక్టివిటీస్ ను చూసుకుంటున్నారు. జూన్ 18 నుండి ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
కాబట్టి, అప్పటిలోగా ఈ సెట్ ను పూర్తి చేయాలనే ఆలోచనతో మేకర్స్ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షెడ్యూల్ ఒకటి పూర్తి అయింది. ఐతే ఆ షెడ్యూల్ లో కొంత భాగం షూటింగ్ ఇంకా జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రత తగ్గిన వెంటనే.. అవకాశం ఉంటే.. లాస్ట్ షెడ్యూల్ లోని సీన్స్ ను షూట్ చేసి ఆ తరువాత కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేస్తారట.
మొత్తానికి నాగార్జున ఈ సారి గట్టిగానే వరుస సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. వాస్తవానికి లాక్ డౌన్ కారణంగా బయట వేయాల్సన సెట్ వేయడానికి కుదరలేదు. దాంతో నాగ్ కలుగజేసుకుని తన స్టూడియోలో సీక్రెట్ గా సెట్ వేయమని సూచించి.. లీగల్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూకున్నాడట. అందుకే అనుకున్న టైంకే ఈ సెట్ ను పూర్తి చేయనున్నారు. ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది.
నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తీ కాగానే నాగ్ “బంగార్రాజు” సినిమాని స్టార్ట్ చేస్తాడట. అయితే ఈ సినిమా నుండి ఇంతవరకూ ఎలాంటి అప్ డేట్ రాలేదు. కానీ ఈ సినిమా ఉంటుంది అనే వార్త సంవత్సరాల తరబడి ఇంకా కొనసాగుతూనే ఉంది. కుదిరితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను నవంబర్ నుండి స్టార్ట్ చేస్తారట.