
ఉత్తరప్రదేశ్ అలీగడ్ పరిధిలో ని కర్సువాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి 11 మంది మృతి చెందారు. మరో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. ఒకే యజమానికి చెందిన రెండు దుకాణాల్లో బాధితులు మద్యం తాగినట్లు గుర్తించిన అధికారులు ఆ దుకాణాలను సీజ్ చేశారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.