
ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, డబుల్ మాస్క్ లాంటి జాగ్రత్తలు పాటించాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల్లో సెల్ప్ డిసిప్లీన్ ఉందన్నారు. అందరూ నిత్యవసరాల కోసమే బయటకి రావాలని చెప్పారు. కర్ఫ్యూ ఎలా పాటిస్తున్నారో పరిశీలించామన్నారు. కొన్ని రోజులు ఇలాంటి జాగ్రత్తలు పాటించాలన్నారు. కొన్ని రోజుల్లో కోవిడ్ నుంచి బయటపడుతామన్నారు. బయటకు వచ్చే వారి వాహనలపై కఠిన చర్యలుంటాయని డీజీపి గౌతం సవాంగ్ హెచ్చరించారు.