
వామన్ రావు న్యాయవాద దంపతుల హత్య కేసులో పుట్ట శైలజకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు కమిషనరేట్ లో పుట్ట శైలజను విచారిస్తున్నారు. పుట్ట మధు దంపతుల ప్రాత ఉందని ఐజికి వామన్ రావు తండ్రి కిషన్ రావు ఫిర్యాదు చేశారు. కొడుకు, కొడలు, హత్యపై మరిన్ని వివరాలు అందించనున్నారు. కొద్దిసేపటి క్రితం కమిషనరేట్ కార్యాలయం నుంచి కిషన్ రావుకి ఫోన్ రావడంతో ఆయన రామగుండం కమిషనరేట్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.