
కరోనా కారణంగా అనాథలుగా మారిన చిన్నారుల అక్రమ దత్తతపై మంగళవారం అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చట్టవిరుద్ధంగా దత్తత తీసుకుంటున్న సంస్థలు, వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు సభ్యుల సుప్రీం ధర్మాసనం చిన్నారుల పరిరక్షణకు సంబంధించిన పిటిషన్ ను విచారించింది. అక్రమ దత్తత సమస్య గురించి జాతీయ బాలల హక్కుల కమిషన్ సుప్రీంకు విన్నవించింది. పిల్లల వివరాలను బహిర్గతం చేస్తూ, దత్తతకు ఆహ్వానిస్తూ చక్కర్తు కొడుతున్న పోస్టులపై తన పిటిషన్ లో ఫిర్యాదు చేసింది. ఎన్జీఓలు నిధులు సేకరించకుండా, దత్తలకు వ్యక్తులను ఆహ్వానించకుండా సుప్రీం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.