https://oktelugu.com/

అప్పటినుండే ఆ హీరోగారి పై విమర్శలు !

హీరో రాజశేఖర్ ‘అన్న’ సినిమా మొదలు పెడుతున్న రోజులు అవి. నిర్మాత పోకూరి బాబూరావుగారికి ‘అన్న’ కథ బాగా నచ్చింది. అందుకే ఆ సినిమా కోసం ఆయన ఆస్తులు అమ్మి, ఈ సినిమాకి పెద్ద మొత్తంలోనే సమకూర్చారు. రాజశేఖర్‌ సరసన రోజాని, గౌతమిని హీరోయిన్లుగా బుక్ చేశారు. ఇక స్క్రిప్ట్ వర్క్‌ జరుగుతున్న సమయం నుండే బాబూరావుగారు, ఈ సినిమా కోసం ఎంతో తపన పడేవారు. కట్ చేస్తే.. ఎట్టకేలకు షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆ రోజుల్లో […]

Written By:
  • admin
  • , Updated On : June 8, 2021 / 04:40 PM IST
    Follow us on

    హీరో రాజశేఖర్ ‘అన్న’ సినిమా మొదలు పెడుతున్న రోజులు అవి. నిర్మాత పోకూరి బాబూరావుగారికి ‘అన్న’ కథ బాగా నచ్చింది. అందుకే ఆ సినిమా కోసం ఆయన ఆస్తులు అమ్మి, ఈ సినిమాకి పెద్ద మొత్తంలోనే సమకూర్చారు. రాజశేఖర్‌ సరసన రోజాని, గౌతమిని హీరోయిన్లుగా బుక్ చేశారు. ఇక స్క్రిప్ట్ వర్క్‌ జరుగుతున్న సమయం నుండే బాబూరావుగారు, ఈ సినిమా కోసం ఎంతో తపన పడేవారు.

    కట్ చేస్తే.. ఎట్టకేలకు షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆ రోజుల్లో ఉదయం ఏడు గంటలకు అందరూ సెట్ కి వచ్చేవాళ్ళు. కానీ ‘అన్న’ షూటింగ్‌ మాత్రం పది గంటలకు ప్రారంభమైయ్యేది. హీరో రాజశేఖర్‌ రోజూ షూటింగ్‌ కు లేట్‌ గా వచ్చేవాడు. ఇలా ఈ సినిమా చేస్తున్నంత కాలం ఇంతే. ఒకపక్క రోజూ ఆర్టిస్ట్ లందర్నీ పిలవడం, రాజశేఖర్ మూడు నుండి నాలుగు గంటలు లేట్ గా రావడం, ఇదే వ్యవహారం.

    డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య ఇక లాభం లేదనుకుని పొదున్నే షూటింగ్‌ స్పాట్‌ కు వెళ్లి, రాజశేఖర్‌ లేని సీన్లను మిగిలిన ఆర్టిస్ట్ ల పై తీసేసి, రాజశేఖర్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవాడు. కానీ, రాజశేఖర్‌ మాత్రం మరింత ఆలస్యంగా వచ్చేవాడు. ఆ కారణంగానే ‘అన్న’ సినిమాను నలభై రోజుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేసి, సుమారు వంద రోజులు పాటు షూట్ చేశారు. రెట్టింపు రోజులు పని చేయాల్సి రావడంతో బడ్జెట్ డబుల్ అయింది.

    నిజానికి పోకూరి బాబూరావుగారు అప్పటికే రిస్క్ చేసి మరీ, రాజశేఖర్ మార్కెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టారు. దీనికితోడు అప్పట్లో ఈ సినిమాలో నటించిన మరో ప్రముఖ నటుడు వల్ల కూడా ఈ సినిమా పది రోజులు పాటు అదనంగా షూటింగ్ జరుపుకోవాల్సి వచ్చింది. మొత్తానికి ‘అన్న’ సినిమా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంటే.. రాజశేఖర్‌ మాత్రం ఈ సినిమాకి ఎలాంటి సపోర్ట్ చేయకపోగా సరిగ్గా ప్రమోషన్ కూడా చేయకుండా డ్యామేజ్ చేశాడు.

    పైగా రాజశేఖర్‌ ఈ సినిమా చేస్తోన్న సమయంలోనే నిర్మాత కె.ఎస్‌.రామారావు నిర్మాణంలో వస్తోన్న ‘అంగరక్షకుడు’ సినిమా కూడా చేస్తున్నాడు. ‘అన్న’ సినిమా కంటే ఎక్కువుగా రాజశేఖర్ ‘అంగరక్షకుడు’ సినిమా పైనే ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. కానీ చివరకు ఈ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి అనుకోండి. ఒక విధంగా ఈ సినిమా నుండే రాజశేఖర్ పై విమర్శలు ఎక్కువయ్యాయి.