కరోనా కట్టడి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కు సడలింపులు ఇస్తున్నట్లు మంగళవారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తర్ ప్రేశ్ లోని 75 జిల్లాల్లో కొవిడ్ యాక్టివ్ కేసులు అన్నీ 600 కంటే తక్కువ ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి అన్ని జిల్లాల్లో లాక్ డౌన్ మినహాయింపులు ఇవ్వనున్నారు. కేవలం రాత్రి కర్ఫ్యూ ఉంనుంది. ప్రతీ జిల్లాలో యాక్టివ్ కేసులు 600 కంటే తక్కువ ఉండటంతో పాటు ఇన్పెక్షన్ రేటు తగ్గుముఖం పట్టడంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.