
సినీ నటుడు, విశ్లేషకుడు కల్తి మహేశ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. చెన్నైలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తిగా కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని సన్నిహితులు తెలిపారు. మహేశ్ కి ఎలాంటి ప్రాణపాయం లేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు అని తెలిపారు. మహేశ్ చూపు కోల్పోయే అవకాశం లేదని వైద్యులు వివరించినట్లు తెలియజేశారు.