
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పన్ను చెల్లింపుదారులకు అదిరిపోయే తీపికబురు అందించింది. పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక ప్రకటనలు చేసింది. కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగే విధంగా పలు అంశాలకు సంబంధించిన డెడ్ లైన్స్ ను పొడిగించింది.
కేంద్రం నిర్ణయం వల్ల పన్ను చెల్లింపుదారులకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. కరోనా చికిత్స కోసం ఉద్యోగులు కంపెనీ నుంచి పొందే డబ్బులపై ఎలాంటి పన్ను ఉండదు. కరోనా చికిత్స కోసం బంధువులు, ఇతరుల నుంచి తీసుకునే డబ్బులకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. మోదీ సర్కార్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గడువును సెప్టెంబర్ నెల 30వ తేదీ వరకు పొడిగించడం గమనార్హం.
కరోనా వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా డబ్బులపై కూడా ఎలాంటి పన్ను ఉండదు. 10 లక్షల రూపాయల వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మోదీ సర్కార్ ఆధార్ పాన్ లింక్ గడువును కూడా పొడిగించగా సెప్టెంబర్ 30వ తేదీ చివరి తేదీగా ఉంది. పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు చెల్లదనే సంగతి తెలిసిందే. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ ద్వారా కూడా కేంద్రం పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చుతోంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఈ స్కీమ్ ద్వారా డబ్బులు వడ్డీ లేకుండా చెల్లించడానికి ఆగస్ట్ 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పన్ను చెల్లింపుదారులకు భారీగా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.