
తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని ఏపీఎస్ఆర్టీసీ కల్పిస్తోంది. ఇందోకోసం ప్రతి రోజు వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంచుతోంది. ఆన్ లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఛార్జీలతోపాటు రూ.300 అదనంగా చెల్లించి శ్రీఘ్రదర్శనం టికెట్టు పొందవచ్చు. ఈ టికెట్లు పొందిన భక్తులకు ప్రతిరోజు ఉదయం 11 గంటలు, సాయంత్రం 4 గంటల స్లాట్లలో శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు.