SRH vs RR: ఐపీఎల్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో తలపడబోతున్నాయి. హైదరాబాద్ జట్టు వరుస ఓటములతో ఒత్తిడిలో ఉండగా.. రాజస్థాన్ జట్టు వరుస విజయాలతో టాప్ స్థానంలో కొనసాగుతోంది. ఇటీవల ఓటములతో హైదరాబాద్ జట్టు కాస్త కుంగు బాటుకు గురైంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు గట్టి పునరాగమనం కోసం ఎదురుచూస్తోంది. అందువల్లే జట్టులో మార్పులు చేర్పులు చేపట్టినట్టు తెలుస్తోంది. బౌలింగ్ అత్యంత బలహీనంగా ఉన్న నేపథ్యంలో.. భారీగా పరుగులు ఇస్తున్న బౌలర్లను పక్కనపెట్టి.. కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
రాజస్థాన్ జట్టు పెద్దగా మార్పులు లేకుండానే రంగంలోకి దిగుతుంది. రాజస్థాన్ జట్టులో సూర్య వంశీ, జైస్వాల్, జురెల్ భీకరమైన ఫామ్ లో ఉన్నారు. ఈ ముగ్గురు రాజస్థాన్ బ్యాటింగ్ భారాన్ని మొత్తం మోస్తున్నారు. ఇప్పటివరకు రాజస్థాన్ జట్టు వరుసగా విజయాలు సాధించింది అంటే ప్రధాన కారణం ఈ ముగ్గురు బ్యాటర్లే. ఇక బౌలర్ గా ఆర్చర్ కూడా అదరగొడుతున్నాడు. పదునైన బంతులు వేస్తూ రాజస్థాన్ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందిస్తున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్ల అంచనాలకు అందకుండా బంతులు వేస్తూ పరుగులను నియంత్రిస్తున్నాడు. అదే సమయంలో వికెట్లను పడగొడుతున్నాడు.
హైదరాబాద్ జట్టు విషయానికొస్తే హెడ్, అభిషేక్ శర్మ కీలకంగా ఉన్నారు. వీరిద్దరూ ఇటీవలి పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో దుమ్మురేపారు. పవర్ ప్లే లో హైయెస్ట్ స్కోర్ సాధించారు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత హైదరాబాద్ జట్టు కాస్త ఇబ్బంది పడింది. ఆ ఇబ్బంది హైదరాబాద్ జట్టును ఓడించింది. ఈ క్రమంలో సోమవారం జరిగే మ్యాచ్ హైదరాబాద్ జట్టుకు అత్యంత ముఖ్యంగా మారింది. అభిషేక్ శర్మ వర్సెస్ జోఫ్రా ఆర్చర్ మధ్య పోరాటం ఆసక్తికరంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్చర్ మీద అభిషేక్ కు సంపూర్ణ ఆధిపత్యం ఉంది. 6 t20 ఇన్నింగ్స్ లలో ఆర్చర్ బౌలింగ్లో అభిషేక్ 62 పరుగులు చేశాడు. రాజస్థాన్ జట్టు బౌలర్లలో మరో ప్రధానమైన బౌలర్ బర్గర్. ఇతడికి హెడ్ కు మధ్య గట్టి యుద్ధమే సాగింది.. ఈసారి జరిగే మ్యాచ్ లో వీరిద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇషాన్ కిషన్, రవి బిష్ణోయ్ మధ్య పోరాటం కూడా ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తోంది. రవి కిషన్ ను 8 ఇన్నింగ్స్ లలో నాలుగు సార్లు అవుట్ చేశాడు. కేవలం 34 మాత్రమే ఇచ్చాడు. రవి గూగ్లీలు హైదరాబాద్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం కల్పిస్తోంది.. యశస్వి జైస్వాల్ వర్సెస్ హర్షల్ పటేల్ మధ్య కూడా పోరాటం దూకుడుగానే ఉండవచ్చు. జైస్వాల్ దూకుడుగా ఆడితే.. పటేల్ వైవిధ్యంతో బౌలింగ్ చేస్తాడు. దీంతో వీరిద్దరి మధ్య పోటీ కూడా ఆసక్తికరంగా. హర్షల్ బౌలింగ్లో జైస్వాల్ కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సూర్య వంశీ వర్సెస్ జయదేవ్ మధ్య కూడా పోటీ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. సూర్యవంశీ ఈ సీజన్లో 275.86 స్ట్రైక్ రేట్ తో పవర్ ప్లే లో పరుగులు తీశాడు. ఇప్పటివరకు హైదరాబాద్ జట్టు పవర్ ప్లే లో 12.4 పరుగులు ఇచ్చింది. సూర్య వంశీ ఆడటం హైదరాబాద్ జట్టుకు ఒకరకమైన సవాల్. జయదేవ్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తే సూర్య వంశీకి బ్రేక్ వేయవచ్చు.