Homeక్రీడలుSRH young bowlers performance : సాకీబ్ ను కిషన్ ప్రోత్సహించాడు.. ఇప్పుడు గనుక కమిన్స్...

SRH young bowlers performance : సాకీబ్ ను కిషన్ ప్రోత్సహించాడు.. ఇప్పుడు గనుక కమిన్స్ జట్టులోకి వస్తే ఉంటది నా సామిరంగా

SRH young bowlers performance : ఐపీఎల్ లో అత్యంత బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ కు పేరుంది. హైదరాబాద్ జట్టులో ఒకప్పుడు అద్భుతమైన బౌలర్లు ఉండేవారు. మేనేజ్మెంట్ నిర్లక్ష్యం.. ఇతర కారణాలవల్ల నాణ్యమైన బౌలర్లు వేరే జట్లకు వెళ్లిపోయారు. దీంతో హైదరాబాద్ జట్టు బౌలింగ్ బలం మొత్తం తగ్గిపోయింది. దీనివల్ల గెలవాల్సిన మ్యాచ్లలో ఓడిపోవాల్సి వచ్చింది.

తాజాగా జరిగిన మ్యాచ్ లో కూడా హైదరాబాద్ ఓటమిపాలైంది. వరుస ఓటములు ఆ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఒకదశలో హైదరాబాద్ జట్టు 280 పరుగులు చేసినా గెలిచేది కష్టమని వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారంటే.. హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇన్నాళ్లకు ఎదురుచూపుల తర్వాత హైదరాబాద్ బౌలింగ్ పూర్తిగా మారిపోయింది. బౌలర్లు ముఖ్యంగా యువకులు సత్తా చాటారు. వారే ప్రఫుల్, సాకిబ్ హుస్సేన్.

ఇప్పటివరకు హైదరాబాద్ బ్యాటర్లను కాటేరమ్మ కొడుకులు అనేవారు. తొలిసారిగా బౌలర్లు ఆ పేరును సార్ధకం చేసుకున్నారు. ప్రఫుల్, సాకీబ్ ఒక మ్యాచ్ లోనే అద్భుతం సృష్టించారు. చెరి నాలుగు వికెట్లను తమ ఖాతాలో వేసుకొని అదరగొట్టారు.. ఈ మ్యాచ్లో సాకీబ్ వేసిన బౌలింగ్ మాత్రం అద్భుతం. ఇక్కడ ప్రఫుల్ బౌలింగ్ ను తక్కువ చేయడం లేదు.. సాకిబ్ నేపథ్యం పూర్తిగా డిఫరెంట్. ఎందుకంటే అతడు బంతులు వేసే విధానం చాలా బాగుంది. ఇతడు సుదీర్ఘకాలం టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడాడు. ఇతడి తండ్రి కూలి కావడంతో.. వివిధ టోర్నమెంట్లలో డబ్బుల కోసం టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడు. వచ్చిన డబ్బులను ఇంట్లో ఇచ్చేవాడు.

ఒక టోర్నీ జరుగుతుండగా ఓ కోచ్ అతడిని చూశాడు. బౌలింగ్ స్టైల్ నచ్చడంతో డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని ప్రోత్సహించాడు. టెన్నిస్ ద్వారా వేగాన్ని ఎలా నియంత్రించాలో సాకీబ్ నేర్చుకున్నాడు. ఈ కార్యక్రమంలో ఎరుపు బంతితో మరిన్ని వేరియేషన్లు నేర్చుకున్నాడు. అందువల్లే రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇషాన్ ప్రతి బంతికి సాకీబ్ వద్దకు వెళ్లాడు. అద్భుతంగా వేస్తున్నావని భుజం తట్టి ప్రోత్సహించాడు. ఇక్కడ ఇషాన్, సాకిబ్ ఇద్దరు కూడా బిహారి యువకులే. అన్నట్టు సాకీబ్ ప్రతిభ గురించి కిషన్ కు బాగా తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రఫుల్, సాకిబ్ కు కనక కమిన్స్ తోడైతే హైదరాబాద్ బౌలింగ్ బలం మరింత పెరుగుతుంది. ఇదే సమయంలో హైదరాబాద్ పూర్వ కెప్టెన్ జట్టులో చేరి.. తన అనుభవాన్ని గనక వీరితో పంచుకుంటే.. హైదరాబాద్ జట్టు బౌలింగ్ బలం మరింత పెరుగుతుంది. ఇదే జోరు కొనసాగిస్తే 2024 లో చేజారిపోయిన ట్రోఫీ.. 2026 లో దక్కుతుంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper
Exit mobile version