spot_img
Homeవార్త విశ్లేషణSreeleela: చేతిలో ఒక్క సినిమా లేదు... ఖాళీగా ఉన్న శ్రీలీల ఏం చేస్తుందో తెలుసా?

Sreeleela: చేతిలో ఒక్క సినిమా లేదు… ఖాళీగా ఉన్న శ్రీలీల ఏం చేస్తుందో తెలుసా?

Sreeleela: హీరోయిన్ శ్రీలీల మొన్నటి వరకు క్షణం కూడా తీరిక లేని బిజీ యాక్ట్రస్. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది. పెళ్ళిసందD చిత్రంతో తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా తో సూపర్ హిట్ కొట్టింది. ధమాకా విజయం తర్వాత ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చాయి. ఒక దాని తర్వాత మరొకటి సినిమాలు చేస్తూ పోయింది. కానీ సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు.

ఆమె గత ఏడాది నటించిన సినిమాల్లో భగవంత్ కేసరి తప్ప మిగిలినవన్నీ డిజాస్టర్ గా నిలిచాయి. ఇక మహేష్ కి జంటగా నటించిన గుంటూరు కారం సైతం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో శ్రీలీల స్పీడ్ తగ్గించింది. ప్రస్తుతం ఆచి తూచి అడుగులు వేయాలి అనుకుంటుంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు మరో సినిమా ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీగా ఉన్న కారణంగా ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ కి తాత్కాలికంగా బ్రేక్ పడింది.

ప్రస్తుతం ఖాళీ టైం దొరకడంతో చదువు పై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి సినిమాల్లో నటిస్తుంది అనే టాక్ వినిపిస్తోంది. శ్రీలీల బెంగుళూరులో ఎంబీబీఎస్ చదువుతున్న సంగతి తెలిసిందే. కాగా తా చిత్రాల విషయంలో చేసిన తప్పులు, ఇకపై చేయకూడదని ఆమె డిసైడ్ అయినట్లు సమాచారం. కథ, తన పాత్ర ప్రాధాన్యత గురించి ఆలోచించకుండా సినిమాలు చేసి బోల్తా పడింది. పెద్ద బ్యానర్, స్టార్ హీరో అయితే చాలని సినిమాలు ఓకే చేసింది.

శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఆది కేశవ, స్కంద, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడ్డాయి. ఇప్పటివరకు నటించిన సినిమాల్లో శ్రీలీల గ్లామర్ షో, డాన్సులకే పరిమితం అయింది. అంతకంటే ప్రత్యేకించి ఆమెకు ఎటువంటి క్రెడిట్ దక్కలేదు. అందుకే ఇకపై తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలు మాత్రమే చేయాలని శ్రీలీల ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ లో గతంలో మాదిరి శ్రీలీలకు ఆఫర్స్ వచ్చే అవకాశం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ విజయం సాధిస్తే మరలా పుంజుకునే ఛాన్స్ ఉంది.

Most Popular

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper
Exit mobile version