https://oktelugu.com/

Puri Jagannadh: హోటల్ లో భార్య చేసిన ఆ పని చూసి వదిలేద్దామనుకున్న డైరెక్టర్ పూరి జగన్నాధ్..!

నేను ఓ సినిమాను డైరెక్టర్ చేస్తున్నాను. అది నా సినిమా కూడా కాదు. వెయ్యి రూపాయలు ఇస్తానంటే చేస్తున్నాను. ఆ షూటింగ్ చూడటానికి ఓ అమ్మాయి వచ్చింది. తన వంకే రెండు గంటలు చూశాను. ఆమె నా వైపు చూడలేదు.

Written By:
  • S Reddy
  • , Updated On : March 26, 2024 / 02:07 PM IST

    Puri Jagannadh sensational comments on his wife Lavanya

    Follow us on

    Puri Jagannadh: దర్శకుడు పూరి జగన్నాధ్ భార్య లావణ్య(Lavanya) గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమెను వదిలివేద్దామని అనుకున్నానంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. పూరి జగన్నాధ్ భార్య పేరు లావణ్య. వీరిది ప్రేమ వివాహం. దర్శకుడిగా ఎదుగుతున్న రోజుల్లో ఆమెను వివాహం చేసుకున్నాడు. తాజా ఇంటర్వ్యూలో పూరి జగన్నాధ్ తన లవ్ స్టోరీ బయటపెట్టాడు. నేను ఓ సినిమాను డైరెక్టర్ చేస్తున్నాను. అది నా సినిమా కూడా కాదు. వెయ్యి రూపాయలు ఇస్తానంటే చేస్తున్నాను. ఆ షూటింగ్ చూడటానికి ఓ అమ్మాయి వచ్చింది. తన వంకే రెండు గంటలు చూశాను. ఆమె నా వైపు చూడలేదు.

    కాసేపటి తర్వాత నా దగ్గర ఉన్న విజిటింగ్ కార్డు ఇచ్చాను. నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే కాల్ చేయమన్నాను. వారం రోజుల తర్వాత ఫోన్ వచ్చింది. అందరికీ ఇలానే విజిటింగ్ కార్డ్స్ ఇస్తావా? ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చావ్? అని ఆమె అంది. తర్వాత అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళం. తనను కలవాలంటే నేను ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసే వాడిని. ఒక రోజు మీడియం రేంజ్ హోటల్ కి వెళ్ళాం. ఆమె తందూరీ చికెన్ చెప్పింది.

    అసలే నా దగ్గర డబ్బులు టైట్ గా ఉన్నాయి. నేనెప్పుడూ కోడిని తినలేదు. ఐస్ క్రీమ్ కూడా తినను. నేను చిన్నగా తింటున్నట్లు నటిస్తున్నాను. ఆమె కోడి మొత్తం తినేసింది. అది చూసి నాకు భయం వేసింది. ఈమెను నేను పోషించలేను. వీళ్ల నాన్న కోళ్లు పెట్టి పెంచినట్లు ఉన్నాడు. మన వల్ల కాదు వదిలేద్దాం అనుకున్నాను. ఇక కలవడాలు వద్దు. ఇష్టం అయితే పెళ్లి చేసుకుందాం అన్నాను.

    నిన్నే పెళ్లాడతా సినిమాకు అసిస్టెంట్ గా చేస్తున్న సమయంలో రహస్య వివాహం చేసుకున్నాము. రామ్ గోపాల్ వర్మ వద్ద నెలకు రూ. 1500 లకు పని చేశాను… అని భార్య లావణ్యతో తన ప్రేమ కహాని ఎలా సాగిందో చెప్పుకొచ్చాడు. పూరి జగన్నాధ్ కి ఇద్దరు పిల్లలు. అబ్బాయి ఆకాష్ హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కొన్ని సినిమాలు చేసినా అతనికి బ్రేక్ రాలేదు. అలాగే ఒక కూతురు ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆమె కూడా నటించారు. నటి ఛార్మితో పూరి సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందనే పుకార్లు వినిపిస్తున్నాయి.