Tamil Nadu : సంగీత కచేరీ లోకి ప్రవేశించిన తమిళనాట భావ ఘర్షణలు

సంగీత కచేరీ లోకి ప్రవేశించిన తమిళనాట భావ ఘర్షణలపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు

Written By: NARESH, Updated On : March 26, 2024 2:34 pm

Tamil Nadu  : తమిళనాట భావఘర్షణ చివరకు సంగీత కచేరీల్లోకి కూడా ప్రవేశించింది. ఇవాళ రెండుగా విడిపోయి తన్నుకుంటున్న పరిస్థితి నెలకొంది. కర్ణాటక సంగీతం అంటే చెవి కోసుకుంటారు. తమిళనాట దక్కిన ఆదరణ, గౌరవం ఎక్కడా రాలేదు.

ఆధునిక ప్రపంచంలో దీన్ని గుర్తించింది మద్రాస్ మ్యూజిక్ అకాడమీ.. సంవత్సరానికి ఒకసారి 9 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. అద్భుతంగా సంగీత ప్రపంచం ఉర్రూతలూగుతుంది.. ప్రతి సంవత్సరం అవార్డ్ కూడా వీరు ఇస్తున్నారు.

డిసెంబర్ 25 నుంచి జనవరి 1 వరకూ ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ సంవత్సరం మ్యూజిక్ అకాడమీ ‘టీఎం కృష్ణ’కు అవార్డ్ ప్రకటించింది. టీఎం కృష్ణ అంటే సంగీత విధ్వాంసుడు.. ఈయన టీటీ కృష్ణమాచార్య మనవడు. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపకులు.. భారత ఆర్థిక మంత్రిగా చేశాడు.

టీఎం కృష్ణ అనే వ్యక్తికి మద్రాస్ మ్యూజిక్ అవార్డ్ ఇవ్వడం ఇప్పుడు వివాదమైంది. విధూశీ సిస్టర్స్ రంజనీ, గాయత్రి అద్భుతమైన కర్ణాటక గాయకులు.. 20వ తేదీన వీరు ఒక లెటర్ రాశారు. టీఎం కృష్ణ కు అవార్డు ఇచ్చి ఆ ఫంక్షన్ లో మేము కచేరీ చేయడానికి మా మనసు ఒప్పుకోవడం లేదని వీరు లెటర్ రాశారు. ఇదే ఇప్పుడు వివాదమైంది.

సంగీత కచేరీ లోకి ప్రవేశించిన తమిళనాట భావ ఘర్షణలపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు