
రష్యాకు చెందిన స్పుత్నిక వి వ్యాక్సిన్ డోసు ధర ను రూ. 995.40 గా నిర్ణయించినట్లు శుక్రవారం వెల్లడించింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న టీకాలను ఈ ధర ఉంటుందని, ఇండియాలో తయారయ్యే వాటికి తక్కువ ధర ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ లో ల్యాండైన ఈ టీకా ఎమ్మార్పీని రూ. 948గా నిర్ణయించగా దానికి 5 శాతం జీఎస్టీ కలిపితే ధర రూ. 995.40 అవుతుంది. ఈ టీకా తొలి డోసును ఇప్పటికే హైదరాబాద్ వ్యక్తికి వేసినట్లు రెడ్డీస్ ల్యాబ్ ఒక ప్రకటనలో తెలిపింది.