
భారత్ నుంచి వెళ్లే విమానాలపై ఆస్ట్రేలియా తాత్కాలికంగా విధించిన నిషేధం ఈ ఆర్ధ రాత్రితో ముగియనున్నది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు. అర్ధరాత్రి నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన వాణిజ్య విమాన సర్వీసులు యథావిధిగా నడుస్తాయని తెలిపారు. అయితే, ఆ దేశ పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి విమాన సర్వీసు ప్రారంభానికి ముందు పటిష్ట తనిఖీ వ్యవస్థ ఉంటుందన్నారు. క్వారెంటైన్ కేంద్రాలను దాటి ప్రజల్లోకి కరోనా వ్యాపించకుండా అడ్డుకునేందుకు ఈ నిషేధం సహకరించిందని మోరిసన్ తెలిపారు.