భారత ఉపఖండానికి నైరుతి రుతుపవనాలు సాధారణ సమయానికే చేరుకొంటాయని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కార్యదర్శి ఎం రాజీవన్ వెల్లడించారు. యథావిధిగా వచ్చే నెల జూన్ 1న కేరళలోకి ప్రవేశించే అవకావం ఉందన్నారు. రుతుపవనాల రాకకు సంబందఇంచి రెండో సానుకూల సూచన ఇది. భారత వాతావరణ శాఖ ఇదే విషయాన్ని ఈ నెల మొదట్లో తెలిపింది. వరుసగా మూడో ఏడాది సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావొచ్చని పేర్కొంది.