
త్వరలో రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగడం, 3 రాజధానులు ఏర్పడటం ఖాయమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో 3 రాజధానుల ఏర్పాటుకు సహాయం చేయాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్ సమస్యల పరిష్కారం సహా పలు అభివృద్ధి అంశాలపై చర్చించారన్నారు. విభజన చట్టంలోని సమస్యల పరిష్కారంపై కేంద్ర మంత్రలతో సీఎం జగన్ ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిపారు.