https://oktelugu.com/

ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో..?

ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, నేవల్‌ అకాడమీ, నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ శుభవార్త చెప్పాయి. 400 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలకు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నాయి. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 29వ తేదీలోగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.upsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. నేషనల్‌ డిఫెన్స్‌ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : June 12, 2021 10:17 am
    Follow us on

    Jobs based on inter

    ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, నేవల్‌ అకాడమీ, నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ శుభవార్త చెప్పాయి. 400 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలకు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నాయి. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 29వ తేదీలోగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.upsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ(ఎన్‌డీఏ)లో 370 ఉద్యోగ ఖాళీలు ఉండగా నేవల్‌ అకాడెమీ(ఎన్‌ఏ)లో 30 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ అర్హత ఉన్న ఉద్యోగులు ఆర్మీ విభాగానికి సంబంధించిన ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎయిర్ ఫోర్స్, నేవల్‌ వింగ్స్‌ పోస్టులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్ పాసైన వాళ్లు, ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

    2003 జనవరి 2 నుంచి 2006 జనవరి 1వ తేదీ మధ్య జన్మించిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలుగా ఉండగా జూన్ నెల 9వ తేదీన ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలుగా ఉంటుంది.

    ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్లకు సెప్టెంబర్ 5వ తేదీ పరీక్ష తేదీగా ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ఆభ్యర్థులకు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి సందేహాలు ఉన్నా వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.