ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కొత్త స్కీమ్ ను అమలులోకి తెచ్చింది. ఈఎస్‌ఐ రిలీఫ్ స్కీమ్ వల్ల ఉద్యోగం చేసేవాళ్లు మరణిస్తే వాళ్ల ఇంట్లో వారికి ఆర్థిక భద్రత కల్పించనుంది. ఈ స్కీమ్ వల్ల చాలామందికి ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. కరోనా వైరస్ వల్ల ఉద్యోగి చనిపోతే కోవిడ్ రిలీఫ్ స్కీమ్ కింద డబ్బులు అందనున్నాయని తెలుస్తోంది.
ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కమిషనర్ (రెవెన్యూ) ఎంకే శర్మ మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ నుంచి ఈఎస్‌ఐ రిలీఫ్ స్కీమ్ ను అమలు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఇందుకు సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ అవుతుందని తెలుస్తోంది. ఇలాంటి స్కీమ్ ను ఒక వ్యాధి కొరకు తీసుకురావడం తొలిస్ ఇదే తొలిసారని శర్మ చెప్పారు. ఈఎస్‌ఐ స్కీమ్‌లో ఉన్నవాళ్లు ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందడానికి అర్హత సాధించే అవకాశం ఉంటుంది.
కరోనా వైరస్ వల్ల మరణించిన ఉద్యోగి కుటుంబానికి ప్రతి నెలా డబ్బులు అందుతాయి. భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులకు ఉద్యోగి వేతనంలో 90 శాతం అందుతాయి. ఉద్యోగి కుటుంబాలకు ఈ స్కీమ్ ద్వారా భారీగా ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. కరోనా వైరస్ విజృంభణ వల్ల దేశంలో ఎన్నో కుటుంబాలు ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉండటం గమనార్హం.
ఈఎస్ఐ స్కీమ్ లో ఉన్నవాళ్లు ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చనే సంగతి తెలిసిందే. ఉద్యోగం కోల్పోయిన వాళ్లు ఈఎస్ఐ సబ్ స్క్రైబర్లుగా ఉంటే ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.