
ఏపీలో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. గత పదిరోజులుగా 2వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా ఇవాళ ఆ సంఖ్య కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో 1,627 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 2017 మంది చిక్సిత్సకు కోలుకున్నారు. 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 19,56,392కు పెరిగింది. ఈరోజు వరకు 19,21,371 మంది కోలుకున్నారు. మరో 21748 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,273 కు చేరాయి.