ట్రైలర్ టాక్: అంతుచిక్కని ‘తిమ్మరసు’ హత్యశోధన

ఒక హత్య జరుగుతుంది.. ఆ తర్వాత ఆ కేసు పట్టిన ఒక లాయర్ ను వెంటాడుతారు. ఇంతకీ ఇవన్నీ చేస్తున్నది ఎవరు? తప్పించుకుంటున్న ఆ క్రిమినల్ గురించి పరిశోధించే లాయర్ హత్యశోధనే ‘తిమ్మరసు’ ట్రైలర్ కథ.. కోర్టు, ఒక హత్య కేసు నేపథ్యంలో సాగే సినిమాగా ‘తిమ్మరసు’ రాబోతోంది. ఈ ఏడాది కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత ‘వకీల్ సాబ్’ విడుదల కాగా.. సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న మొదటి చిత్రం ‘తిమ్మరుసు’. ఈ సినిమాలో హీరోగా […]

Written By: NARESH, Updated On : July 28, 2021 3:58 pm
Follow us on

ఒక హత్య జరుగుతుంది.. ఆ తర్వాత ఆ కేసు పట్టిన ఒక లాయర్ ను వెంటాడుతారు. ఇంతకీ ఇవన్నీ చేస్తున్నది ఎవరు? తప్పించుకుంటున్న ఆ క్రిమినల్ గురించి పరిశోధించే లాయర్ హత్యశోధనే ‘తిమ్మరసు’ ట్రైలర్ కథ..

కోర్టు, ఒక హత్య కేసు నేపథ్యంలో సాగే సినిమాగా ‘తిమ్మరసు’ రాబోతోంది. ఈ ఏడాది కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత ‘వకీల్ సాబ్’ విడుదల కాగా.. సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న మొదటి చిత్రం ‘తిమ్మరుసు’. ఈ సినిమాలో హీరోగా సత్యదేవ్ నటిస్తున్నాడు. ప్రియాంక జువాల్కర్ హీరోయిన్..మహేష్ కోనేరు, సృజన్ ఎరబోలు నిర్మాతలు.. జూలై 30న ఈ సినిమా థియేటర్లో విడుదల కానుంది.

ఆద్యంతం ఆసక్తి రేపేలా ఉన్న ఈ క్రైం థ్రిల్లర్ ట్రైలర్ ను తాజాగా జూనియర్ ఎన్టీఆర్ లాంచ్ చేశాడు. చిత్రం ట్రైలర్ చాలా బాగుందని.. కోర్టు , హత్య నేపథ్యంలో సాగే సన్నివేశాలతో ఆద్యంతం అరలిస్తోందని ఎన్టీఆర్ అన్నారు.

ట్రైలర్ చూస్తే లాయర్ గా సత్యదేవ్ అద్భుతంగా నటించాడు. ఆయన లుక్ ఎమోషన్స్ , డైలాగులు ఆకట్టుకున్నాయి. ఏదో హత్యపై లాయర్ పరిశోధించే కథగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.సత్యదేవ్ పంచ్ డైలాగులు ఆసక్తి రేపాయి. ఈ చిత్రానికి సంగీతం శ్రీచరణ్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు.

తిమ్మరుసు ట్రైలర్ ను కింద చూడొచ్చు