టోక్యో ఒలింపిక్స్ లో మీరాబాయి చానుకు స్వర్ణం దక్కేనా?

టోక్యో ఒలింపిక్స్ కు భారత్ ఎన్నో ఆశలతో బయలుదేరింది. పతకాల పంట పండించేందుకు క్రీడాకారులు నిరంతరం శ్రమించి తమ సత్తా పెంచుకున్నారు. ప్రత్యర్థి దేశాలను మట్టికరిపించే క్రమంలో పలు విధాలుగా నిష్ణాతులైన శిక్షకులతో రాటు దేలారు. దేశం కోరుకుంటున్న రంగాల్లో పతకాలు ఎలాగైనా రాబట్టాలనే కృతనిశ్చయంతో ముందుకు కదులుతోంది. ఇప్పటికే కొన్ని రంగాల్లో దూసుకుపోతున్నా మరికొన్ని రంగాల్లో మాత్రం విఫలమవుతోంది. ఈ నేపథ్యంల సగటు భారతీయుడి కోరిక నెరవేరే విధంగా తమ ఆటకు పదును పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. […]

Written By: Srinivas, Updated On : July 26, 2021 5:24 pm
Follow us on

టోక్యో ఒలింపిక్స్ కు భారత్ ఎన్నో ఆశలతో బయలుదేరింది. పతకాల పంట పండించేందుకు క్రీడాకారులు నిరంతరం శ్రమించి తమ సత్తా పెంచుకున్నారు. ప్రత్యర్థి దేశాలను మట్టికరిపించే క్రమంలో పలు విధాలుగా నిష్ణాతులైన శిక్షకులతో రాటు దేలారు. దేశం కోరుకుంటున్న రంగాల్లో పతకాలు ఎలాగైనా రాబట్టాలనే కృతనిశ్చయంతో ముందుకు కదులుతోంది. ఇప్పటికే కొన్ని రంగాల్లో దూసుకుపోతున్నా మరికొన్ని రంగాల్లో మాత్రం విఫలమవుతోంది.

ఈ నేపథ్యంల సగటు భారతీయుడి కోరిక నెరవేరే విధంగా తమ ఆటకు పదును పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. క్రీడాకారులు నిత్యం పలు ఈవెంట్లలో తమ ప్రతిభ చూపెడుతూ పైకి వెళుతున్నారు. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మరో బంగారు పతకం వచ్చే అవకాశం ఉంది. వెయిట్ లిఫ్టింగ్ లో భారత క్రీడాకారిణి మీరాబాయి చాను వెండి పతకం గెలిచిన సంగతి తెలిసిందే.

చైనా క్రీడాకారిణి జీహుహో తొలి స్థానంలో నిలిచి బంగారు పతకం గెలుచుకుంది. కాగా చైనా క్రీడాకారిణి జీహుహోను డోపింగ్ టెస్టు కోసం పంపాలని నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే జీహుహోను టోక్యోలోనేఉ:డాలని నిర్వాహకులు ఆదేశించారు. ఈ డోపింగ్ టెస్టులో చైనా అథ్లెట్ జీహుహో దోషిగా తేలితే ఆమె గెలుచుకున్న బంగారు పతకం మీరాబాయి చాను సొంతం కానుంది.

చైనాకు చెందిన జీహుహో శనివారం మొత్తం 210 కిలోలను ఎత్తి స్వర్ణం సాధించి సరికొత్త ఒలింపిక్ రికార్డును సృష్టించింది. ఒక అథ్లెట్ డోపింగ్ పరీక్షలో విఫలమైతే వెండి పతకం గెలిచిన అథ్లెట్ కు బంగారం లభిస్తుందని ఒలింపిక్ నియమాలు చెబుతున్నాయి. ఈ లెక్కన భారత్ ఖాతాలో స్వర్ణ పతకం వచ్చే చాన్స్ ఉంది. ఈ పోటీల్లో భారత్ వెయిట్ లిఫ్టర్ చాను మొత్తం 202 కిలోల బరవును ఎత్తి రెండో స్థానంలో నిలిచింది.

అలాగే ఇండోనేషియా విండి కాంటికా ఐసా 194 కిలోల బరువును ఎత్తి మూడో స్థానంలో నిలిచింది. మరో వైపు 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో 69 కిలోల విభాగంలో కరణం మల్లీశ్వరి కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఆమె తరువాత మీరాబాయి చాను ఒలింపిక్ పతకంసాధించి రికార్డు నెలకొంది. దీంతో బంగారు పతకం మీరాబాయి చాను వశం కానుందని తెలుస్తోంది.