
ఏపీలో గడిచిన 24 గంటల్లో 49,581 కరోనా టెస్టులు చేస్తే 1145 మందికి పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 17 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 20,28,795కు చేరగా ఇప్పటి వరకు 13,987 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 1,090 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,157 యాక్టివ్ కేసులు ఉన్నాయి.