దేశంలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. శుక్రవారం 34 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా తాజాగా అవి 35 వేలు దాటాయి. దీంతో ఇది నిన్నకంటే 3.65 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కొత్తగా 35,662 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మెత్తం కేసులు సంఖ్య 3,34,17,390కి చేరింది. ఇందులో 3,40,639 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటి వరకు కొత్తగా 33,798 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కరోనా వ్యాక్సిన్ సరికొత్త రికార్డు సృష్టించింది. శుక్రవారం దేశ వ్యాప్తంగా 2.5 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేశారు. దీంతో ఇప్పటి వరకు చైనా పేరుతో ఉన్న ఒక్కరోజులో అత్యధిక టీకాలు పంపిణీ చేసిన రికార్డును భారత్ తుడిచివేసింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2.5 కోట్ల మందికి వ్యాక్సిన్ చేశామని వెల్లడించింది.
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17 వరకు 55,07,80,273 నమూనాలకు పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోదనా మండలి తెలిపింది. నిన్న ఒకేరోజు 14,48,833 మందికి పరీక్షలు చేశామని తెలిపింది. నిన్న ప్రధాని మోదీ పట్టిన రోజు వేళ.. కరోనా టీకా కార్యక్రమం జెట్ స్పీడ్ తో ముందుకెళ్లింది. ఒక్కరోజే 2.5 కోట్ల డోసులు పంపినీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. దాంతో మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 79,42 కోట్లకు చేరింది.