డార్లింగ్ ప్రభాస్ కాస్త నేషనల్ స్టార్ ప్రభాస్ గా మారేసరికి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ రేంజ్ ని పెంచుతూ పోతున్నాడు. ఆదిపురుష్ అనే ఈ మైథలాజికల్ డ్రామాలో శ్రీరాముడిగా ప్రభాస్, రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతుంది. త్వరలో ప్రభాస్ పాల్గొనే ఓ భారీ యాక్షన్ సీన్ ను ఈ చిత్రం కోసం చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్ ’(‘God Father’) సినిమాలో చాలా కీలక పాత్రలు ఉన్నాయి. ఈ క్రమంలో లూసిఫర్ లో మంజు వారియర్ పోషించిన కీలక పాత్రను తెలుగులో వచ్చే సరికి విజయశాంతి నటించబోతుంది. విజయశాంతి ఈ పాత్రకు ఎంచుకోవడానికి కారణం.. ఆ పాత్ర చాలా కీలకమైనదట.
రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో తాజాగా నటిస్తున్న సినిమా ‘డాక్టర్ జీ’. ఈ సినిమాలో తన లుక్ ను రకుల్ షేర్ చేస్తూ ఈ పాత్రలో నటిస్తున్నందుకు థ్రిల్ ఫీలవుతున్నారని చెబుతుంది.