
కర్నూలు కేఎస్ కేర్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఆక్సిజన్ అందక ఆరుగురు కరోనా రోగులు మృతి చెందారు. తమకు ఆక్సిజన్ అందడం లేదని రోగులు ఎంత మొత్తుకున్నా ఆస్పత్రి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు. అయితే కరోనా చికిత్సకు ఈ ఆస్పత్రి వైద్యులకు ఎలాంటి అనుమతులు లభించలేదు. అయినా సరే కరోనా చికిత్స చేస్తున్నారు. అయిత ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో వారు ఆస్పత్రికి చేరుకున్నారు.