https://oktelugu.com/

హీరోల పై పూరి హాట్ కామెంట్స్ మళ్ళీ వైరల్

ఈ వార్త చాల ఓల్డ్ న్యూసే లేండి. కాకపోతే మన హీరోల స్వభావం ఎలా ఉంటుందో.. సినిమా ఒప్పుకోవడానికి ముందు వాళ్ళు ఎలా ఆలోచిస్తారో స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ ఓ సందర్భంలో ఇలా చెప్పుకొచ్చాడు. పూరి మాటల్లోనే ‘‘సినిమా ఇండస్ట్రీలో ఓ జోక్‌ ఉంది. అది ఏంటంటే.. ఏ హీరోకి ఏ కబుర్లు చెబితే స్పీడ్ గా డేట్లు ఇచ్చేస్తారో ఇప్పుడు చెబుతా. అంటూ ముందుగా పవన్ గురించి ఇలా చెప్పాడు. ‘ఈ సినిమాలో అన్నీ […]

Written By:
  • admin
  • , Updated On : May 1, 2021 / 05:37 PM IST
    Follow us on

    ఈ వార్త చాల ఓల్డ్ న్యూసే లేండి. కాకపోతే మన హీరోల స్వభావం ఎలా ఉంటుందో.. సినిమా ఒప్పుకోవడానికి ముందు వాళ్ళు ఎలా ఆలోచిస్తారో స్టార్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ ఓ సందర్భంలో ఇలా చెప్పుకొచ్చాడు. పూరి మాటల్లోనే ‘‘సినిమా ఇండస్ట్రీలో ఓ జోక్‌ ఉంది. అది ఏంటంటే.. ఏ హీరోకి ఏ కబుర్లు చెబితే స్పీడ్ గా డేట్లు ఇచ్చేస్తారో ఇప్పుడు చెబుతా. అంటూ ముందుగా పవన్ గురించి ఇలా చెప్పాడు.

    ‘ఈ సినిమాలో అన్నీ గన్సే.. పైగా విలన్‌ పెద్ద గన్‌ డీలర్‌.. కాబట్టి అతన్ని ఇష్టమొచ్చినట్టు కాల్చేసుకోవచ్చు’ అని చెబితే పవన్‌ కల్యాణ్‌ వెంటనే డేట్స్ ఇచ్చేస్తాడట. అలాగే ప్రభాస్ గురించి చెబుతూ ‘ఈ సినిమా కోసం అసలు అవుట్‌ డోర్‌ అంటూ ఏమీ లేదండీ. మొత్తం అంతా ఇండోర్‌ సెట్స్‌లోనే తీస్తున్నాం’ అని చెబితే ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చేస్తాడు అని పూరి తెలిపాడు.

    ఇక ఎన్టీఆర్ తో ‘ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు కొట్టేద్దాం’ అని అంటే ‘కుమ్మేద్దాం భయ్యా’ అంటూ ఎన్టీఆర్‌ కాల్షీట్‌ ఇచ్చేస్తాడని చెప్పాడు. ‘ఇవాళ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తే 30 రోజుల్లో సినిమా అయిపోతుంది’ అని చెబితే రవితేజ డేట్స్‌ ఇస్తాడట. అయితే వీటన్నిటిలో కల్లా మహేష్ బాబు గురించి చెప్పింది చాల బాగా పేలింది. ఏమిటి అంటే అది.. ‘రేపు సినిమా స్టార్ట్‌ అవుతుంది సర్‌. ఎప్పుడు ఫినిష్‌ అవుతుందో తెలియదు’ అని చెబితే వెంటనే మహేష్ డేట్స్‌ ఇస్తాడని పూరి నవ్వుతూనే పంచ్ వేశాడు.

    మొత్తానికి పూరి ఇది ఇండస్ట్రీలో వినిపించే టాక్‌ అంటూ.. అప్పుడెప్పుడో అనగా బిజినెస్ మెన్ ఆడియో ఫంక్షన్ లో ఈ జోక్స్ పేల్చాడు. పైగా పూరి ఈ జోక్స్ చెబుతున్నప్పుడు ఆ వేదిక దగ్గర మహేష్ బాబు కూడా ఉన్నాడు. నమ్రతతో పాటు మహేష్ కూడా పూరి మాటలకు నవ్వుతూనే ఉన్నారు. ముఖ్యంగా ప్రేక్షకులు అయితే, పూరి మాటలకు కడుపుబ్బా నవ్వారు.