Sikkim: సిక్కింలోని ఛటేన్ అనే ప్రదేశంలో మిలిటరీ క్యాంప్ పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించగా మరో ఆరుగురి ఆచూకీ గల్లంతైంది. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు సోమవారం ధ్రువీకరించారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురి మృతదేహాలను దళాలు గుర్తించాయి. మరో నలుగురు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆచూకీ గల్లంతైన వారిని కాపాడేందుకు సహాయక దళాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి.