Shreyas Iyer sister : ఈ ఐపీఎల్ ప్రారంభంలో పంజాబ్ జట్టు తిరుగులేని స్థాయిలో ఆడింది.. వరుసగా ఏడు విజయాలు అందుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు పంజాబ్ జట్టు ఆట తీరు పూర్తిగా మారిపోయింది. వరుసగా ఓటములు ఎదురయ్యాయి. ప్లే ఆఫ్ పెళ్లి.. దర్జాగా ట్రోఫీ అందుకుంటుందనే అంచనాల నుంచి.. దారుణంగా గ్రూప్ దశ నుంచి నిష్క్రమించింది.
పంజాబ్ ఇలా ఆడటంతో చాలామంది విమర్శలు చేస్తున్నారు. సర్పంచ్ సాబ్ ను మొదట ప్రశంసించినవారు.. ఆ తర్వాత ఆరోపణలు చేస్తున్నారు. జట్టును నడిపించిన తీరు బాగోలేదని మండిపడుతున్నారు. కొంతమంది బౌలర్ల మీద.. బ్యాటర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు సరిగ్గా ఆడి ఉంటే జట్టుకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని గుర్తు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తోంది. ఆ వీడియోలో ఉన్న ప్రధాన వ్యక్తి మరెవరో కాదు సర్పంచ్ సోదరీమణి శ్రేష్ట.
పంజాబ్ జట్టు ఈ ఐపీఎల్లో ఒక్క పాయింట్ తేడాతో ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించింది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అయ్యర్ సోదరి శ్రేష్ట మీద నెటిజన్లు విపరీతంగా మండిపడుతున్నారు. గత నెల 3న పంజాబ్, కోల్కతా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. దీనివల్ల రెండు జట్లకు చెరొక పాయింట్ లభించింది. ఈ క్రమంలో శ్రేష్ట ఒక వీడియో చేసింది. కోల్కతాకు దయతో ఒక పాయింట్ ఇచ్చామంటూ ఆమె లేని గొప్పలకు పోయింది.. ఇప్పుడు ఆ వీడియోను చాలామంది గుర్తు చేస్తున్నారు. ఆమె చేసిన ఆ ఒక్క పాయింట్ వీడియో ఇప్పుడు పంజాబ్ జట్టు ప్లే ఆఫ్ ఆశలను దూరం చేసిందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
సర్పంచ్ మంచి ఆటగాడు. పోరాటస్ఫూర్తిని కొనసాగించేవాడు. అతడు జట్టు విజయాల కోసం ఎంతగానో తాపత్రయపడతాడు. కానీ చెల్లి రూపంలోనే అతడికి శత్రువు ఉంది. అఆ సినిమాలో.. శత్రువులు ఎక్కడ ఉండరు.. తోడ పుట్టిన వాళ్ళ రూపంలో మన నటింట్లోనే తిరుగుతుంటారని రావు రమేష్ చెబుతుంటాడు. అలాగే అయ్యర్ పరిస్థితి కూడా ఉందని నెటిజన్లు వ్యంగంగా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
IPL 2026లో 'ఒక్క పాయింట్' తేడాతో ప్లేఆఫ్స్ రేసు నుండి PBKS తప్పుకోవడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్‌పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఏప్రిల్ 3న పంజాబ్, కోల్కతా మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. అప్పట్లో ‘కోల్కతాకు దయతో ఒక… pic.twitter.com/cMYtNu4vj5
— ChotaNews App (@ChotaNewsApp) May 25, 2026
