Shivaji vs Anasuya : ఏ ముహూర్తాన సామాన్లు అని వ్యాఖ్యానించాడో గాని.. గరుడ పురాణం శివాజీ ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. సరిగా 2024లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఓ ప్రైవేట్ న్యూస్ చానల్ లో శివాజీ గరుడ పురాణం పేరుతో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అప్పట్లో ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఆయన మాట్లాడిన మాటలను ప్రైవేటు న్యూస్ ఛానల్ గాయి గాయి చేసింది. అసలు శివాజీకి ఉన్న అర్హత ఏమిటి? అతడి స్థాయి ఏమిటి? అనే విషయాలను ఆ మీడియా సంస్థ పట్టించుకోలేకపోయింది.
ఇప్పుడిక ఆడవాళ్ళ వస్త్రధారణకు సంబంధించి చివరి చేసిన వ్యాఖ్యలు.. సామాన్లు అంటూ మాట్లాడిన లేకి మాటలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. మధ్యలోకి కురచ దుస్తుల అనసూయ.. నెత్తి మాసిన సినిమాలు తీసే రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి శ్రీపాద వచ్చారు. ప్రపంచానికి సుద్ధులు చెప్పే, ఈ కాలపు స్త్రీమూర్తులుగా చెప్పుకునే అనసూయ ఏదేదో వాగింది.. ఇక చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరంతా కూడా స్త్రీ సమాజాన్ని ఏదో ఉద్ధరించినట్టు.. స్త్రీల కోసం ఏవో గొప్ప పనులు చేసినట్టు డప్పులు కొట్టుకుంటున్నారు.. అలాగని ఇక్కడ శివాజీ గొప్పవాడు అని చెప్పడం లేదు.
శివాజీ ఆ టైంలో గరుడ పురాణం మాటలే మాట్లాడాడు. మంగపతి క్యారెక్టర్ ఇచ్చిన బలుపు కావచ్చు అది. క్యారెక్టర్ అనేది ఒక పాత్ర మాత్రమే.. అందులోనే లీనమైపోయి.. తాము ఏదో గొప్ప వాళ్ళమని నటలనుకుంటే ఇదిగో ఇలాంటి సమస్యలే వస్తుంటాయి. వాస్తవానికి సైకాలజీ భాషలో ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు.. నీలో అన్ని బాగున్నాయి కానీ.. అదొక్కటే తేడాగా ఉందని అన్నాడు అనుకోండి.. అక్కడే అసలు సమస్య వస్తుంది. అన్ని బాగున్నాయనే విషయాన్ని మర్చిపోయి.. బాగోలేదు అనే విషయాన్ని మాత్రమే గుర్తు పెట్టుకుంటారు. దాని చుట్టే ఆ ఆలోచనలు తిరుగుతుంటాయి. బాగున్నవాటిని ఏమాత్రం పట్టించుకోకుండా.. బాగోలేని ఆ ఒక్క విషయాన్ని మాత్రమే పదేపదే గుర్తుకు తెచ్చుకుంటే మనిషి సైకలాజికల్ గా ఇబ్బంది పడతాడు.
దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ మాట్లాడిన అన్ని మాటలను వదిలేసి.. కేవలం సామాన్లు అనే మాటలను మాత్రమే అనసూయ పట్టుకుంది. చిన్మయి పదేపదే గెలికింది. ఇంకేముంది కావలసినంత రచ్చ జరుగుతోంది. ఏకంగా మహిళా కమిషన్ రంగంలోకి వచ్చి శివాజీని చెడా మడా వాయించింది. ఇది ఇంతవరకు ఆగిపోతుందా? ఇంకా ఏమైనా రచ్చ జరుగుతుందా?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేం గానీ.. ఆమధ్య గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చీరలు, గాజులు పంపిస్తున్నామని విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. ఇప్పుడు శివాజీ ఏమో సామాన్లు అంటూ మాట్లాడాడు.. ఇలాంటి లేకి వ్యక్తులకు, సెల్ఫీ అడిగిన మహిళ అభిమాని ఫోన్ పగలగొట్టిన అనసూయకు, నెత్తి మాసిన కథలతో సినిమాలు తీసే రాహుల్ భార్య చిన్మయికి గరుడ పురాణంలో ఎటువంటి శిక్షలు ఉండవా?!