
సీఎం కేసీఆర్ ఇలాక కొండపాకలోని ఓ మామిడితోటలో అధికారులు మందు పార్టీని నిర్వహించారు. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ అధికారులు మందు పార్టీలో ఊగిపోయారు. కొండపాక మండల అధికారులు ఈ పార్టీ ఏర్పాటు చేశారు. అయితే ఈ పార్టీకి మహిళా ఉద్యోగులు హాజరు కావడం గమనార్హం. జిల్లా ఎంపీవోలకు ఆహ్వానం అందగా డీఆర్డీ, ఓపీడీ, ఇన్ ఛార్జీ డీపీవో భోజనం చేసి వెళ్లినట్లు సమాచారం. పార్టీకి కొండపాక మండల పంచాయతీ కార్యదర్శులు చందాలు వేసుకున్నట్లు తెలుస్తోంది.