రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న కొత్త సినిమాల్లో , ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించిన చిత్రం ‘రావు బహదూర్’. తన ప్రతీ సినిమాతో ప్రేక్షకులకు కొత్త రకమైన సినిమాటిక్ అనుభూతిని కలిగించాలని తపన పడే సత్యదేవ్ ఈ చిత్రం లో హీరో గా నటించగా, ‘కేర్ ఆఫ్ కంచెరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. ఇక మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రమోట్ చేయడమే కాదు , ట్రైలర్ కి వాయిస్ ఓవర్ ని కూడా అందించారు. ఇలా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని కలిగించిన ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బలంగానే జరిగింది. సత్యదేవ్ కి సోలో హీరో గా ఇప్పటి వరకు స్థిరమైన మార్కెట్ లేదు అనేది వాస్తవం.
ఆయన నటించిన సినిమాలకు ఓటీటీ లో మంచి ఆదరణ దక్కాయి కానీ , థియేట్రికల్ ఆదరణ మాత్రం దక్కలేదు. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి మార్కెట్ లో 10 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తికరంగా ఉండడం తో పాటు , వెంకటేష్ మహా , సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ ఇమేజ్ కూడా ఈ చిత్రానికి కలిసొచ్చింది. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టాలంటే 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. మరి ఆ రేంజ్ వసూళ్లు వస్తాయా అంటే , అవుననే అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఒక్క నార్త్ అమెరికా నుండే ఈ చిత్రానికి లక్ష డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇది సాధారణమైన విషయం కాదు. టాక్ వస్తే కచ్చితంగా ఈ చిత్రం 1 మిలియన్ గ్రాస్ వసూళ్లను కూడా రాబడుతుంది , అందులో ఎలాంటి సందేహం లేదు. ‘కేర్ ఆఫ్ కంచెరపాలెం’ చిత్రం లో డైరెక్టర్ వెంకటేష్ మహా ఇచ్చే కొన్ని ట్విస్టులకు ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యింది. ఇదేంటి బాబు , అసలు ఊహించలేకపోయాము, టేకింగ్ లో ఇది మాస్టర్ పీస్ రేంజ్ అని ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్ చేశారు. హీరో సత్య దేవ్ ‘రావు బహదూర్’ లో అంతకు మించిన ట్విస్టులు , షాకింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయని చెప్పుకొచ్చారు. అదే కనుక నిజమైతే , బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల సునామీ ని సృష్టించబోతోంది అనొచ్చు , అందులో ఎలాంటి సందేహం లేదు.

