Sankranthi 2026 : ప్రతీ సంక్రాంతి కి లాగానే , ఈ సంక్రాంతికి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోరు జరగనుంది. ఈసారి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(The Rajasaab), మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) సినిమాలు మాత్రమే పెద్ద సినిమాలు. ఈ రెండు సినిమాలతో పాటు విడుదల కాబోతున్న రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘అనగనగా ఒక రాజు’ మరియు ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాలు మీడియం రేంజ్ సినిమాలు. ఈ 5 సినిమాలకు సంబంధించిన మొదటి కాపీలు రెడీ అయిపోయాయి. వీటిల్లో కొన్నిటికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి, కొన్నిటికి అవ్వలేదు.కానీ వీటికి సంబంధించిన రిపోర్ట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రెండు సినిమాలకు మంచి పాజిటివ్ బజ్ ఉందట.
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి మంచి పాజిటివ్ బజ్ ఉందట. సినిమా రొటీన్ గానే ఉన్నప్పటికీ, సంక్రాంతి ఆడియన్స్ కావాల్సిన ఎలిమెంట్స్ మొత్తం ఈ చిత్రం లో ఉన్నాయని, మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ కూడా అదిరిపోయింది అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ఆ తర్వాత సంక్రాంతి రేస్ లో పాజిటివ్ రిపోర్ట్స్ ని సొంతం చేసుకుంటున్న మరో సినిమా, నవీన్ పోలిశెట్టి హీరో గా నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం. ఈ సినిమాకు కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక ప్రభాస్ అభిమానులకు ఈసారి నిరాశ తప్పేలా లేదు. ఎందుకంటే ఈ సినిమా సెకండ్ హాఫ్ అనుకున్నంత స్థాయిలో రాలేదట. ప్రభాస్ సోదరి సైతం డైరెక్టర్ మారుతీ కి రెండు రీల్స్ కట్ చేయమని సూచించినట్టు తెలుస్తోంది.
హారర్ ఎలిమెంట్స్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదట, అదే ఈ సినిమాకు మైనస్ అని అంటున్నారు. కానీ ఆడియన్స్ నుండి వచ్చే రియాక్షన్ ఇలా ఉండకపోవచ్చు, చూడాలి మరి. ఇక రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఉంటుందట. రీసెంట్ గా విడుదలైన రవితేజ అన్ని సినిమాలకంటే బెటర్. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. ఇక శర్వానంద్ హీరో గా నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం బిలో యావరేజ్ రేంజ్ లో ఉందని టాక్. సంక్రాంతికి తూచా తప్పకుండా ఇలాగే జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కానీ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా ఏ సినిమా సంక్రాంతి విజేతగా నిలుస్తుందో చూడాలి.