Mahindra కార్లకు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంటుంది. వీటి ధర ఎక్కువ అయినా కూడా చాలామంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు..SUV వేరియంట్ లో కస్టమర్లకు అనుగుణంగా కార్లను తీసుకొచ్చి ఆకట్టుకుంటుంది. అయితే ఈ కంపెనీ లేటెస్ట్ గా XEV 9S అనే SUV EV కారును ప్రవేశపెట్టింది. ఇప్పటికే Mahindra కంపెనీకి చెందిన BE 6, XEV 9 మోడల్స్ కంటే ఇది ఒక ఫ్లాగ్ ఫిష్ మోడల్గా నిలుస్తుంది. జనవరి 5న మార్కెట్లోకి వస్తున్న ఈ కారు గురించి తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంది. దీని పూర్తి వివరాలు లోకి వెళ్తే..
కొత్తగా మార్కెట్లోకి వచ్చే Mahindra XEV 9S క్యాబిన్ విశాలమని చెప్పుకోవచ్చు. ఇది పక్కా కన్వెన్షన్ SUV లా తలపిస్తుంది. 4737 ఎంఎం పొడవు, 1900 ఎంఎం వెడల్పు, 1747 ఎంఎం ఎత్తు, 2762 ఎంఎం వీల్ బేస్ ఉండడంతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఎలక్ట్రిక్ వేరియంట్ లో వస్తున్నా ఈ కారులో మొత్తం మూడు పవర్ ఫుల్ బ్యాటరీని అమర్చారు. ఇందులో ఒకటి 59 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని సెట్ చేశారు ఇది 512 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. అలాగే 228 బీహెచ్పీ పవర్ ను అందిస్తుంది. మరో బ్యాటరీ 70 కే డబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 600 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. మూడో బ్యాటరీ 79 కే డబ్ల్యూహెచ్. ఇది 679 కిలోమీటర్ల మైలేజ్ జీవన్ ఉంది. ఈ మూడు ఫ్యాక్టరీలు ఉండడంతో వాహనానికి అత్యంత శక్తిని ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇవి 380 NM ఠాకూర్ రిలీజ్ చేస్తాయి.
ఇది SUV వెహికిల్ లా ఆకట్టుకోవడమే కాకుండా ఇందులో అద్భుతమైన లేటెస్ట్ టెక్నాలజీ ఈ చలన అమర్చారు. ముఖ్యంగా ఇందులో ట్రిపుల్ స్క్రీన్ సెట్అప్ చేశారు. ఇవి 12.3 అంగుళాల డిస్ప్లేను ఇవ్వడంతో పాటు ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ద్వారా మొబైల్ కు కొన్ని ఫీచర్లు సపోర్ట్ చేస్తాయి. డ్రైవర్లకు స్మూత్ మూవింగ్ తో పాటు కావాల్సిన సపోర్ట్ ఉంటుంది. ప్రీమియం కార్లకు తీసుకోకుండా ఇందులో ఎలక్ట్రికల్ గా అడ్జస్ట్బుల్ అయ్యే ఫీచర్లు ఉన్నాయి. వెంటిలేటెడ్ సీట్లతోపాటు పనోరమిక్ sunroof, డ్యూయల్ వైర్లెస్ చార్జింగ్, foldable snak tray వంటివి ఆకర్షిస్తాయి.
Mahindra కార్లు సేఫ్టీకి పెట్టింది పేరు. ప్రతి కారులో రక్షణ కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు. ఈ కారులో కూడా అనుకూలమైన సేఫ్టీ ఫీచర్లను అమర్చారు. ఇందులో మొత్తం 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అడాస్ టెక్నాలజీ డ్రైవర్ ను ఎంతో సురక్షితంగా ఉంచుతుంది. దీనిని రూ. 19.95 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.