Chiranjeevi Surgery : గత కొంతకాలంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మోకాళ్ళ నొప్పి సమస్య తో బాధపడుతున్నారు. అందుకు సంబంధించి రీసెంట్ గానే ఆయన సర్జరీ చేయించుకున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) షూటింగ్ సమయం లోనే ఆయనకు మోకాళ్ళ నొప్పి తీవ్రంగా ఉండేది. కానీ ఆ సినిమా కోసం నొప్పిని భరించి పూర్తి చేసిన తర్వాతనే, ఆయన మోకాళ్ళకు సర్జరీ చేయించుకున్నట్టు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం సర్జరీ విజయవంతంగా పూర్తి అయ్యిందని, ఈ వారం లోనే ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని, చిరంజీవి తో పాటు, మూవీ యూనిట్ మొత్తం ఈ ఈవెంట్ లో పాల్గొంటుందని అంటున్నారు.

ఇది ఇలా ఉండగా, ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తన మార్క్ ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టేసాడు. రీసెంట్ గానే చిరంజీవి తో కలిసి కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాడట. త్వరలోనే ఆ ఇంటర్వ్యూ వీడియోలను విడుదల చేయబోతున్నారు. అయితే ప్రస్తుతానికి రీసెంట్ గా జరిగిన సర్జరీ విషయాన్నీ గోప్యంగా ఉంచింది చిరంజీవి టీం. ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటిస్తారా లేదా అనేది చూడాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీ టీం చిరంజీవి ఈ చిత్రం కోసం పెట్టిందా డెడికేషన్ గురించి కచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది. ఆ సమయం లో ఈ సర్జరీ గురించి కూడా అభిమానులకు చెప్పే అవకాశాలు ఉన్నాయి.

ఇకపోతే నిన్ననే విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ థియేట్రికల్ ట్రైలర్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గత పదేళ్లుగా మిస్ అవుతున్న మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ ని ఈ సినిమాలో అనిల్ రావిపూడి చూపించాడని, చిరంజీవి ని చూస్తుంటే అన్నయ్య, రౌడీ అల్లుడు కాలం నాటి కామెడీ టైమింగ్ గుర్తుకొచ్చిందని అంటున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి మూడు పాటలు విడుదల అయ్యాయి. మూడిట్లో ఒక పాట సెన్సేషనల్ హిట్ అయ్యింది, మిగిలిన రెండు పాటలు యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ఇంకా ఒక పాట బ్యాలన్స్ ఉందట. ఇది మంచి డ్యాన్స్ నెంబర్ అని, ఈమధ్య కాలం లో చిరంజీవి నుండి ఈ రేంజ్ డ్యాన్స్ స్టెప్పులు అభిమానులు చూసి ఉండరని, కచ్చితంగా మెంటలెక్కిపోతారని అంటున్నారు. మరి ఈ పాటని ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఈ పాటని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథి గా విచ్చేసే అవకాశాలు ఉన్నాయి.